
సమ్మర్ స్విమ్మింగ్ ఫ్లూల్స్ కు చాలా డిమాండ్
సిరా న్యూస్,హైదరాబాద్; హైదరాబాద్ స్విమ్మింగ్ ఫూల్స్లో చిన్న, పెద్ద అనే వయసు తేడా లేకుండా ఈత నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు నగరవాసులు. దీనితో స్విమ్మింగ్ పూల్స్ అన్నీ ఈతగాళ్లతో కలకలాడుతున్నాయి. ఈత నేర్పించాలని ఉద్దేశంతో తల్లిదండ్రులు పిల్లలను స్విమ్మింగ్ పూల్‌కు తీసుకొస్తారు. సిమ్మింగ్ నేర్చుకోవాలనుకునే వారికి ఎండాకాలం ఓ చక్కని అవకాశం. ముఖ్యంగా వేసవి సెలవుల్లో స్విమ్మింగ్‌పై విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో సిటీలోని స్విమ్మింగ్ పూల్ అన్ని ఉదయం, సాయంత్రం వేళలో ఫుల్ రద్దీగా కనిపిస్తున్నాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా స్విమ్మింగ్ పూల్స్‌లో ఈత నేర్చుకుంటున్నారు నగరవాసులు. సిమ్మింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు పబ్లిక్. ఈత కొట్టడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం, దొరుకుతుంది. బాడీ ఫిట్‌గా, మంచి ఆకృతిలో ఉంటుందని చెబుతున్నారు. దినచర్యలో భాగంగా డైలీ ఒకసారి…
