
అసంతృప్తితో కొండా సురేఖ
సిరా న్యూస్,వరంగల్; బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మరో వికెట్ పడింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కాంగ్రెస్ గూటికి చేరారు. రెండు నెలలుగా సారయ్య పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చివరకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సారయ్య చేరిక తో వరంగల్ లో రాజకీయ అలజడి మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకుడిగా, మాజీ మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బస్వరాజు సారయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన సారయ్య 1999 నుండి 2009 వరకు వరుసగా మూడుసార్లు గెలిచారు. 2009 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా చేశారు. 2014 ఎన్నికల్లో బీ అర్ ఎస్ అభ్యర్థి కొండా సురేఖ చేతిలో ఓడిపోయారు. అప్పటి…
