Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 11 February 2024, 5:13 pmEditor : SIRA NEWS

Survey No. 170: ఆదిలాబాద్ లో భూ కబ్జాలు సహించేది లేదు… ఎమ్మెల్యే పాయల్ శంకర్

సిరా న్యూస్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ లో భూ కబ్జాలు సహించేది లేదు… ఎమ్మెల్యే పాయల్ శంకర్

+ సర్వే నంబర్ 170 బాధితులకు భరోసా

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సర్వే నంబర్ 170లో నిరుపేదల ఇండ్ల స్థలాలను కబ్జా చేసిన వారిని ఉపేక్షించేది లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాఖ్యానించారు. 170 సర్వే నంబర్ లోగల తమ ఇండ్ల స్థలాలు కబ్జాకు గురయ్యాయని పలువురు బాధితులు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను కలిశారు. ప్రభుత్వం తమకు ఇండ్ల నిర్మాణం కోసం కేటాయించిన భూమిని కొంతమంది కబ్జా చేసినట్లు వాపోయారు. తమ ఇండ్ల స్థలాలు తమకు అప్పగించి ఆదుకోవాలని ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కబ్జాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సహించేది లేదని అన్నారు. వెంటనే బాధితులకు తమ ఇండ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను ఆదేశించారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.