తాజా వార్తలు

చెరువును మింగేసిన ఇన్ ఫ్రా

సిరా న్యూస్,హైదరాబాద్; సాక్షాత్తు నీటిపారుదల శాఖ అధికారులు చెరువు ఉందని తమ రిపోర్టులో స్పష్టం చేసిన గ్రేటర్ ఇన్ ఫ్రా అక్రమాలకు అడుగులొత్తుతూ ఉన్నతాధికారులు తప్పుడు రిపోర్ట్‌తో సంస్థను కాపాడే యత్నం చేశారు. ముడుపుల మాయలో పడ్డ అధికారుల అండతో కుంట పూర్తిగా మాయమైపోయింది. ప్రభుత్వం మారితే గత ప్రభుత్వ అక్రమాల గుట్టు బయటపడుతుందని ఆశించిన స్థానికులకు నిరాశే మిగిలింది. అధికారులు అండగా నిలబడడంతో అక్రమాల తంతు కొనసాగుతూనే ఉంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఒర్రకుంట అక్రమార్కుల చేతిలో చిక్కి మాయమైపోతుంది. ఒకప్పుడు నిండుకుండ లాంటి నీటితో కళకళలాడిన ఆ ప్రదేశంలో విల్లాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. సాక్షాత్తు 2017లో జాయింట్ సర్వే చేపట్టి హెచ్ఎండీఏ అధికారిక సైట్‌లో ఒర్ర కుంటకు సంబంధించి లేక్ మ్యాప్, ఎఫ్‌టీఎల్, క్యాడాస్ట్రల్ మ్యాప్‌లను పొందుపరిచింది.…

Read More
14 Feb 2024, 3:50 pmsiranews.in