
గులాబీకి దక్కని సానుభూతి…
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో ఫిరాయింపుల రాజకీయం జోరు మీద ఉంది. రోజుకో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. కేసీఆర్తో సమావేశం కోసం ఫామ్ హౌస్ కు వెళ్లిన వారు తర్వాతి రోజు వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే ప్రారంభమైన చేరికలు ఇప్పుడు జోరందుకుంటున్నాయి. ఇప్పటి వరకూ ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. మరికొంత మంది అదే దారిలో ఉన్నారు. సహజంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే.. సామాన్యమైన విషయం కాదు. కానీ అది ఎన్నికలకు ముందు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అందుకే ఎక్కువ మంది ఆ పార్టీలో చేరికకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీలో అసంతృప్తి ఎక్కువైనా సరే చేర్చుకుంటున్నారు కూడా. బీఆర్ఎస్…
