తమ్మినేని దారెటు…

సిరా న్యూస్,శ్రీకాకుళం;
పాలిటిక్స్‌ ఈజ్‌ ఆల్‌వేస్‌ ఇంట్రెస్టింగ్‌. పైగా పేరున్న నేత పదవిలో ఉన్నా లేకపోయినా హాట్ టాపికే. ఏపీలో అలాంటి కటౌటే తమ్మినేని సీతారాం. ఫైర్ బ్రాండ్‌గా..పదవి ఉన్నా.. లేకపోయినా..తనకంటూ ఓ సెపరేట్‌ స్టైల్ ఉంటుంది. ప్రత్యర్థులపై మాటల తూటాలతో విరుచుకుపడుతుంటారు. అలాంటి సీనియర్ నేతకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడిందట. దశాబ్దాలుగా తను కంచుకోటగా తయారు చేసుకున్న నియోజకవర్గం చేజారిపోతుందన్న భయం వెంటాడుతోందట.ఐదుసార్లు ఎమ్మెల్యేగా..మంత్రిగా, ఏపీ శాసనసభాపతిగా..పనిచేశారు తమ్మినేని సీతారాం. మూడు దశాబ్దాలుగా ఆమదాలవలస నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకున్నారు. అయితే ఆయన 2019లో ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్ అయిన తర్వాత ఆమదాలవలస నియోజకవర్గంలో పరిస్థితులు మారుతూ వచ్చాయి. స్వపక్షంలోనే విపక్షం తయారైంది. సీతారాం గెలుపు కోసం కష్టపడ్డ నేతలే ఆయనపై తిరుగుబాటు చేశారు. సువ్వారిగాంధీ లాంటి సీనియర్ నేత.. ఏకంగా తమ్మినేని సీతారాంపై రెబల్‌గా పోటీ చేశారు. నియోజకవర్గంలో సొంత పార్టీలో వ్యతిరేకతకు తమ్మినేని కుటుంబ సభ్యులే కారణమన్న టాక్‌ జిల్లాలో గట్టిగా వినిస్తోంది.ఇటీవల శ్రీకాకుళం జిల్లా ముఖ్యనేతలతో వైసీపీ అధినేత జగన్‌ సమావేశం అయ్యారు. ఆ మీటింగ్‌ తర్వాత తమ్మినేని సీతారాంకు శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. తమ్మినేనిని వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ బరిలో దించుతారని.. ఆమదాలవలస నియోజకవర్గ బాధ్యతలు కొత్త నాయకుడికి అప్పగించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోందంటూ వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తమ్మినేని సీతారాం కొడుకు చిరంజీవి నాగ్ ఆమదాలవలస రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. అయితే అనేక మంది వైసీపీ ద్వితీయస్థాయి నేతలు చిరంజీవి నాగ్ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆమదాలవలసకు కొత్త నాయకుడు కావాలన్న చర్చ క్యాడర్‌లో గట్టిగానే నడుస్తోంది.వయస్సు రిత్యా తమ్మినేని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది కూడా డౌట్. దీంతో తన కుమారుడ్ని ఎలాగైనా ఆమదాలవలస నుంచి బరిలో దించాలన్న ప్లాన్ చేస్తున్నారట. స్థానిక నాయకుల నుంచి మాత్రం వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో..తన వారసుడి రాజకీయ భవితవ్యంపై తెగ బెంగ పెట్టుకున్నారట. తాను నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉంటేనైనా కొడుకుకు టికెట్‌ కోసం ఫైట్ చేసే వాడినని.. తనను పార్లమెంట్ ఇంచార్జ్‌గా వేశారని బాధ పడుతున్నారట. మరి నియోజకవర్గంపై ఉన్న పట్టుతో కొడుకుకే ఇంచార్జ్ బాధ్యతలు వచ్చేలా లాబీయింగ్‌ చేస్తారా లేక..ఆమదాలవలస నియోజకవర్గానికి తమ్మినేని సీతారం గుడ్ బై చెబుతారో వెయిట్ చేయాల్సిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *