
ప్రజల మనసులో టాటా చిరంజీవే
సిరా న్యూస్,హైదరాబాద్; జంతుప్రేమికులు మనకు చాలా మందే కనిపిస్తుంటారు. కానీ రతన్ టాటా మాత్రం పూర్తిగా వేరు. ఆయన ప్రేమకు అవధులు ఉండవు. రోడ్డు మీద వెళ్లే వీధి కుక్కల్ని చూస్తే ప్రాణం అల్లాడిపోతుంది. కన్నీళ్లు పెట్టుకుంటారు. అందుకే వాటి సంరక్షణ కోసం తన జీవితాంతం కృషి చేశారు. ప్రమాదాల బారిన పడో లేదా మరేదైనా ఘటనతో అవయవాలు సరిగ్గా లేకుండా ఇబ్బంది కుక్కులను తిరిగి నడిచేలా చేశారు. వాటి సంరక్షణ, పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవటం రతన్ టాటాకు చాలా ఇష్టమైన వ్యాపకం. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలున్న రతన్ టాటా సోషల్ మీడియా చూస్తే ఈ విషయం ఇట్లే అర్థమైపోతుంది. ఈ రోజు కుక్కపిల్ల దొరికింది. ఎవరైనా దీన్ని పెంచుకోవాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి అని పెడతారు. ఎవరైనా ఆ కుక్కను అడాప్ట్ చేసుకుంటే ధన్యవాదాలు…
