సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
ఉపాధ్యాయుడు అసంపెల్లి మహేందర్‌కు సన్మానం
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయుడిగా కొలువు సాధించిన పెగడపల్లి గ్రామానికి చెందిన అసంపెల్లి మహేందర్ ను శుక్రవారం కాల్వ శ్రీరాంపూర్ మాజీ సర్పంచ్ మాదాసి సతీష్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్ లు సాల్వా కప్పి సన్మానం చేసి అభినందించారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థులను ఉత్తమ బోధన అందించి భావి భారత భారత పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు. కార్యక్రమంలో యూఎస్ఎప్ఐ పెద్దపల్లి జిల్లా రామగల్ల సురేష్, కాల్వశ్రీరాంపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎనగంట రవి,శ్రీనివాస్ ,దర్శనాల రాజు నర్సు, కుమార్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.