Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 8 August 2024, 3:08 pmEditor : SIRA NEWS
Teacher Mamata: గుండెపోటుతో సమగ్ర శిక్ష ఉద్యోగిని మమత మృతి

సిరాన్యూస్, ఆదిలాబాద్
గుండెపోటుతో సమగ్ర శిక్ష ఉద్యోగిని మమత మృతి
గుండెపోటుతో సమగ్ర శిక్ష ఉద్యోగిని మమత మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన చెందిన మగ్ర శిక్ష ఉద్యోగిని మమత (27) గాదిగుడా మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు గుండెపోటు రాగా హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మమత మృతి చెందారు. ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం అధికార ప్రతినిధి పడాల రవీందర్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి సాయం చేసేందుకు ప్రతి ఉద్యోగి సిద్దంగా ఉండాలని ఆయన కోరారు.
