
Telangana: బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు
సిరా న్యూస్, హైదరబాద్: బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు – త్వరలో మంత్రి వర్గ విస్తరణ – కీలక శాఖల్లో మార్పులకు అవకాశం తెలంగాణలో త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నందున, బీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి చేరిన పలువురు సీనియర్లకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రి వర్గ విస్తరణతో పాటు కీలక శాఖల్లో సైతం మార్పులకు ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మంత్రి వర్గంలో మరో ఆరు గురికి అవకాశం ఉండగా బీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఖాయమని అంతా భావిస్తున్నారు. పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే పోచారంకు మంత్రి…
