
కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చింది
కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు. కేసీఆర్‌ను తెలంగాణను ఎవరూ వేరు చేయలేరు కక్షతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు సిరా న్యూస్,మెదక్ ; : తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పోరాటం వల్లే వచ్చింది. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు న్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు. కేసీఆర్‌ను తెలంగాణను ఎవరూ వేరు చేయలేరు.తెలంగాణ వచ్చింది కాబట్టే మన నీళ్లు మనకు వచ్చినయి, మన గ్రామలు అభివృద్ధి చెందినయి. తెలంగాణ వచ్చింది కాబట్టే ఆసరా పెన్షన్ వచ్చింది, రైతుబంధు, రైతు బీమా వచ్చింది. కళ్యాణ లక్ష్మి వచ్చింది, దివ్యాంగుల పెన్షన్ వచ్చింది, కేసీఆర్ కిట్…
