Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 25 January 2024, 7:59 pmEditor : Sira News

తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి

బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ

పార్టీ గ్రామీణ అధ్యక్షుడు రవి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ సమావేశం

 సిరా న్యూస్,బద్వేలు;
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ
విజయమే లక్ష్యంగా పనిచేయాలని బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కోరారు. అసెంబ్లీ ఎన్నికలలో ప్రతి కార్యకర్త నాయకుడు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆమె కోరారు.
గురువారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ గ్రామీణ అధ్యక్షుడు రవి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బయనపల్లె బూత్ లెవెల్ సమావేశం జరిగింది. సమావేశంలో విజయమ్మ మాట్లాడుతూ పార్టీ నాయకులకు కార్యకర్తలకు దశ దిశ నిర్దేశం చేశారు. సమావేశంలో విజయమ్మ మాట్లాడుతూ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఇంచార్జి బొజ్జ రోశన్న గెలుపు కోసం ప్రతి నాయకుడు కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు. బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో తెలుగుదేశం పార్టీ ఎంతో బలంగా ఉందని ప్రజల్లో ఉందని వారిని కలుసుకొని పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు తెలియపరచి వారిని ఉత్తేజ పరచాలని ఆమె కోరారు. వైకాపా పాలనలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు అన్ని విధాల నష్టపోయినట్లు తెలిపారు. నవరత్నాల పేరుతో ప్రజలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల మోసం చేసినట్లు ఆరోపించారు. అన్న క్యాంటీన్లు మూసి వేయించి పేదల ఉసురు పోసుకున్నట్లు ఆరోపించారు రైతుల గోడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. సాగునీరు తాగునీరు కోసం రైతులు ప్రజలు అల్లాడిపోతున్నట్లు తెలిపారు. రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఎంతో ఉందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూముల కబ్జాలు పెరిగిపోయినట్లు ఆమె తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బద్వేల్ లో జరిపిన పాదయాత్రలో వైకాపా నాయకులు కార్యకర్తలు బద్వేలు నియోజకవర్గంలో జరిపిన భూముల కబ్జాలు ఇంటి స్థలాల కబ్జాల గురించి వారి చిట్టా విప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇంకా పలు విషయాల గురించి ఆమె మాట్లాడారు. సమావేశంలో పార్టీ నాయకులు పిల్లి భాస్కర్ బాబు ఆనంద్ సుధాకర్ బీవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.