
పదెకరాలకే రైతు భరోసా..!
మార్గదర్శకాలు సిద్ధం అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్న సర్కార్ నెలాఖరులోపు పెట్టుబడి సాయం షురూ. సిరా న్యూస్,హైదరాబాద్; ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసాపై దృష్టి సారించింది. పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు తీపి కబురు చెప్పింది. రైతు భరోసాకు పదెకరాల వరకు కటాఫ్ విధించాలని నిర్ణయించింది. ఈమేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం నివేదికను సమర్పించినట్టు తెలిసింది. నివేదికలోని కీలకమైన మార్గదర్శకాలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. గత బీఆర్ఎస్ సర్కారు ఐదేండ్లలో రైతు బంధు పేరిట దాదాపు రూ.20వేల కోట్లను వ్యవసాయేతర భూములకు ఇచ్చి ప్రజా సొమ్మును వృధా చేసిందని పెట్టుబడి సాయంలో 96శాతం రైతులకు మేలు చేసేందుకు సర్కారు సిద్ధమవుతున్నదని సీఎం రేవంత్రెడ్డి చెప్పిన…
