
ఇవాళ టెన్త్ ఫలితాలు
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 30న) వెలువడనున్నాయి. ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదలచేయనున్నారు. ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు మొత్తం 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలురు 2,57,952 మంది; బాలికలు 2,50,433 మంది ఉన్నారు. ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://bse.telangana.gov.in తోపాటు వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్రంలో 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకనం ప్రక్రియను అధికారులు చేపట్టారు. టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 20తో ముగిసింది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడంతో ఫలితాల వెల్లడికి అధికారులు సన్నాహాలు ప్రారంభించిన…
