
ప్రక్షాళన తర్వాత పరీక్షలు
సిరా న్యూస్,హైదరాబాద్; ఎన్నికల హామీల్లో ప్రకటించిన విధంగా.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రక్షాళనపై కాంగ్రెస్ సర్కార్ వేగం పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే టీఎస్పీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కమిషన్‌పై సమీక్షలు నిర్వహించారు. బోర్డు ప్రక్షాళనలో భాగంగానే టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్‌రెడ్డి రాజీనామా చేశారు. ఆయన బాటలోనే మరో ముగ్గురు సభ్యులు గవర్నర్‌కు రాజీనామాలు పంపారు.రాజీనామాలకు ఇంకా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలపలేదు. వారు రాజీనామా చేసి రెండు వారాలు గడుస్తున్న గవర్నర్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లు కనిపిస్తుంది. రాజీనామాల ఆమోదంలో న్యాయనిపుణుల సలహా గవర్నర్ కోరినట్లు సమాచారం. రాజీనామాల అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలిసింది.రాజీనామాల విషయం కొలిక్కి రాకపోవడంతో నోటిఫికేషన్ల విషయంలో అడుగు…
