తాజా వార్తలు

అన్నదాతలను ఆగమాగం చేసిన రైతన్న

సిరా న్యూస్,నిజామాబాద్; పంట వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చేవరకు, చిన్నపాటి యుద్ధాన్ని చేసే రైతన్న.. తీరా పంట చేతికి వచ్చాక దళారుల దగ్గర పోరాడలేక ఓడిపోతున్నాడు. తాజాగా అకాల వర్షాలు రైతన్నను నిండా ముంచేస్తున్నాయి. చేతికందొచ్చిన పంట కళ్లెదుటే మట్టిపాలు కావడంతో గుండెలు బాదుకుంటున్నారు అన్నదాతలు. ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో భోరుమంటున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పెద్దఎత్తున ధాన్యం వర్షార్పణమైంది. వానల నుంచి పంటను కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు రైతులు.దంచికొడుతున్న వానలు అన్నదాతలను నట్టేట ముంచాయి..నోటి కాడి బుక్క నీటిపాలడంతో రైతన్నలు దిగులుతో తలలు పట్టుకుంటున్నారు. కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం వరదల్లో కొట్టుకుపోతుంటే, రైతన్న గుండె చెరువు అవుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో గతవారం రోజుల నుండి కురుస్తున్న వడగండ్ల వానల ప్రభావంతో వివిధ పంటలకు ఊహించిన విధంగా నష్టం…

Read More
18 May 2024, 3:40 pmsiranews.in