
వైఎస్ వారసత్వం కోసం పోరాటం…
సిరా న్యూస్,విజయవాడ; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనదైన ముద్ర వేశారు. ఆయన ఆకస్మిక మరణంతో అప్పటికే ఎంపీగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారసుడిగా తెరపైకి వచ్చారు. ఆయనను గుర్తించినా సీఎం పదవిని ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. చాలా మంది సీనియర్లు ఉన్నందున ఉన్న పళంగా సీఎం పదవి ఇవ్వడం సాధ్యం కాదని చెప్పడంతో ఎమ్మెల్యేలంతా సానుకూలంగా ఉన్నా సరే హైకమాండ్ అంగీకరించలేదు. కారణం ఏదైనా కాంగ్రెస్ లో భవిష్యత్ ఉండదని డిసైడ్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆ సమయంలో ఆయన వెంట కుటుంబం మొత్తం ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి మాత్రం కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కొనసాగినా.. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసినా తర్వాత జగన్ దగ్గరకే చేరుకున్నారు. వైఎస్ కుటుంబం అంతా ఏకగ్రీవంగా వైఎస్…
