
ఆ నలుగురి ఎమ్మెల్యేల వెనుక మాజీ మంత్రి..?
సిరా న్యూస్,మెదక్; తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. తెలంగాణ రాజకీయల్లో త్వరలో మార్పులు జరుగబోతున్నాయా? అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టిందా? బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని ఇటీవలే రాష్ట్రానికి వచ్చారు. ఆయనను ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు మంగళవారం కలిశారు. ఒకేసారి నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. వీరంతా కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురు ఎమ్మెల్యేల్లో సునీతా లక్ష్మారెడ్డి…
