Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 6 February 2024, 5:10 pmEditor : Sira News

కలెక్టర్ ను కలిసిన జిల్లా వీఆర్వోల సంఘం నేతలు..!

సిరా న్యూస్,తిరుపతి;

వీఆర్వోల సంఘం కలెక్టర్ ఘన సన్మానం

తిరుపతి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీ శా ను తిరుపతి జిల్లా వీఆర్వోల సంఘం నేతలు సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు కలెక్టర్ లక్ష్మీ శ ను జాయింట్ కలెక్టర్ శుభం బస్వల్ ను కలిసిన వీఆర్వోల సంఘం నేతలతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పనిచేసి ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ తలెత్తకుండా బాధ్యతగా పనిచేయాలన్నారు. అంతకు ముందు తిరుపతి జిల్లా వీఆర్వో సంఘం అధ్యక్షుడు ఆర్. నాగరాజ, డివిజన్ అధ్యక్షులు చంగల రాయులు, జీ .భాస్కర్ ,హరికృష్ణ, ప్రసాద్ లు వారిని సన్మానించారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.