తాజా వార్తలు

తెరపైకి మరో 12 మంది నేతల పేర్లు

సిరా న్యూస్,హైదరాబాద్; బీఆర్ఎస్ పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. సీఎం రేవంత్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ లీడర్, ఆ ఎమ్మెల్యేలతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నట్టు తెలుస్తున్నది. కబురు పంపిన వెంటనే పార్టీలో చేరేందుకు సదరు ఎమ్మెల్యేలను మానసికంగా సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే ఒకరు..ఇద్దరు ఎమ్మెల్యేల చేరికలు కాకుండా ఏకంగా బీఆర్ఎస్‌ఎల్పీ విలీనం కోసం కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య కోసం కాంగ్రెస్ పోకస్ పెట్టినట్లు తెలిసింది. అందుకే పార్టీ మారేందుకు రెడీగా ఉన్న ఆ 13 మంది ఎమ్మెల్యేలను వెయిటింగ్‌లో పెట్టినట్టు ప్రచారం ఉంది.కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్న 13 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచే ఉన్నట్లు తెలిసింది. ఆ లిస్టులో ఉన్న ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు…

Read More
22 Jun 2024, 2:15 pmsiranews.in