Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 19 December 2023, 4:09 pmEditor : Sira News
మినీ వ్యాన్ లో మంటలు.. వ్యక్తి సజీవ దహనం

సిరా న్యూస్,కాకినాడ;
వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియా లో సంతోషి ఆయిల్ కంపెనీ లోకి లోడింగ్ కు వెళుతున్న మినీ వ్యాన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక వ్యక్తి సజీవదహనం అయ్యాడు. సామర్లకోట మండలం పవర గ్రామానికి చెందిన బాలరాజు (70)గా గుర్తించారు.
డోర్ తెరుచుకోక పోవడం కారణంగా సజీవదహనం అయ్యాడు. కాకినాడ డిఎస్పీ మురళీ కృష్ణా రెడ్డి, కాకినాడ రూరల్ ఎమ్మార్వో మొరార్జీ, సర్పవరం సిఐ ఆకుల మురళీ కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
