
వసూళ్ల రాణి…
సిరా న్యూస్,గుంటూరు; ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఐదేళ్లు మంత్రిగా కొనసాగి సీనియర్లకు కూడా షాక్ ఇచ్చారు విడదల రజినీ. అధికారం అండతో మాజీ మంత్రి నియోజకవర్గంలో ప్రజలను ఏ రకంగా ఇబ్బందులు పెట్టారోనని ఒక్కో ఘటన వెలుగులోకి వస్తున్నాయి. ప్రజాప్రతినిధిని అనే విషయం మర్చిపోయి తన అనుచరులు తన కుటుంబీకులతో రాచరికపు పరిపాలన సాగించిందని స్వయంగా నియోజకవర్గ ప్రజలే చెప్పటం ఇప్పుడు అందరిని నోటిన వేలు వేసుకునేలా చేస్తుంది. రజినీతో పాటు.. ఆమె మరిది గోపి, పీఏ రామకృష్ణ ఆగడాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.ముందుగా రజినీపై.. పసుమర్రు రైతులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగనన్న కాలనీ భూముల్లో ఆమె భారీ స్కామ్‌కు పాల్పడినట్లు వారు తెలిపారు. జగనన్న కాలనీ పేరుతో…
