
Eetela rajender : కమలంలో ఇమడ లేకపోతున్న ఈటెల
సిరా న్యూస్,హైదరాబాద్; ఈటల రాజేందర్ మావోయిస్టు ఉద్యమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర మంత్రి అయ్యారు. బీఆర్ఎస్ లో ఉద్యమకాలం నుంచి పనిచేసి కేసీఆర్ కు చేదోడు వాదోడుగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందు కూడా కేసీఆర్ ఈటల రాజేందర్ కు ప్రయారిటీ ఇచ్చారు. శాసనసభలో పార్టీ నేతగా అవకాశం కల్పించారు. అలా ఈటల రాజకీయ ప్రస్థానం మొదలయింది. 2014లో బీఆర్ఎస్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలకంగా మారారు. ఆయన బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు ఉద్యమం నుంచి రావడం, మంచి వాగ్దాటి ఉండటంతో ఆయనకు అవకాశాలు అనుకోకుండానే తరముకుంటూ వచ్చాయంటారు. అయితే 2018లో రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ కు, కేసీఆర్ కు మధ్య గ్యాప్ పెరిగింది.…
