
బొత్స పోటీ వెనుక వ్యూహం…
సిరా న్యూస్,విశాఖపట్టణం; విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును జగన్ ప్రకటించడం వైసీపీలోనే చర్చనీయాంశం అవుతోంది. దీనికి కారణం అసలు బొత్స సొంత గూడు కాంగ్రెస్లోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ అభ్యర్థిత్వానికి అంగీకరించడమే. బొత్స కూడా పోటీకి సుముఖత వ్యక్తం చేయలేదని కానీ జగన్ కార్పొరేటర్లతో మీటింగ్ పెట్టి పిలిచి బలవంతంగా అంగీకరింప చేసి ప్రకటించారని అంటున్నారు.ఓటమి తరువాత బొత్స పెద్దగా మీడియా ముందుకు కూడా రావటం లేదు. వచ్చినా నామ మాత్రంగా ప్రెస్ మీట్ పెట్టేసి ముగించేస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీచేసేందుకు ఆయన సిద్ధంగా లేకపోయినా జగన్ తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి ఒప్పించినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 841 ఓట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీకి…
