తాజా వార్తలు

మండలిలో పెరగనున్న ఎన్డీయే బలం

 సిరా న్యూస్,విజయవాడ; ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు అయ్యారు. టీడీపీ నుంచి సీ రామచంద్రయ్య పేరును ప్రస్తావించగా, జనసేన నుంచి హరిప్రసాద్‌ ఎంపికయ్యారు. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది ఎన్డీఏ సర్కారు. ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల అయ్యింది. జూలై 12న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్డీఏ అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక స్థానాన్ని టీడీపీకి.. మరో స్థానాన్ని జనసేనకు కేటాయించింది. టీడీపీ నుంచి కడప జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్, మాజీ ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య పేరు ఖరారు కాగా.. మరోవైపు జనసేన పార్టీ నుంచి ఆపార్టీఅధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్‌ పేరు ఖరారు…

Read More
2 Jul 2024, 1:44 pmsiranews.in