
సుంకిశాల ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే
సిరా న్యూస్,నల్గోండ; రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరానికి తాగునీటిని అందించేందుకు మొదలైన సుంకిశాల ప్రాజెక్టు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ ప్రాజెక్టులో ఈ నెలారంభంలో జరిగిన సంఘటనతో పంప్ హౌజ్ మొత్తం నీటితో నిండిపోయింది.ఇన్టేక్ వెల్ రక్షణ గోడ కూలిపోయిన సంఘటనతో పనులు నిలిచిపోయాయి. సాగర్ రిజర్వాయర్ కనిష్ట మట్టానికి నీరు చేరితే కానీ తిరిగి సొరంగం, ఇతర పనులు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 2వ తేదీన రక్షణ గోడ కూలిపోయి సుమారు రూ.20కోట్ల నష్టం వాటిల్లింది. ఈ సంఘటనను అటు జలమండలి అధికారులు, ఇటు మేఘా ఇంజనీరింగ్ సంస్థ గోప్యంగా ఉంచాయి.సోషల్ మీడియాలో వచ్చాక కానీ, ఈ సంఘటన ప్రభుత్వం దృష్టికి రాలేదు. దీంతో విపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎంలు విరుచుకు పడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో హడావిడిగా తమకు…
