
బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలు ఇవే..
సిరా న్యూస్,ముంబై; సినీ పరిశ్రమకు ఈ ఏడాది ప్రత్యేకమైన సంవత్సరం అని చెప్పాలి. సౌత్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్.. టాప్ డైరెక్టర్స్ మూవీస్ రిలీజ్ కాలేదు. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అటు కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న బాలీవుడ్ కు ఈ ఏడాది కొత్త ఊపిరినిచ్చింది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ భారీగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ బ్రేక్ చేశాయి. ఈ ఏడాది థ్రిల్లర్స్, కామెడీ, యాక్షన్ చిత్రాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాల నుంచి ఇటీవల బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ అయిన…
