
కాలర్ ఎగరేసుకుని థియేటర్ నుంచి బయటకు వస్తారు..
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నితిన్ సిరా న్యూస్; నితిన్ , శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకుడు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్ల మీద ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. ఈ మూవీ డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో నితిన్ మాట్లాడుతూ.. ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా నాకు చాలా స్పెషల్. ఇంత వరకు నేను ఇలాంటి కారెక్టర్ చేయలేదు. ఇలాంటి పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడు వక్కంతం వంశీకి థాంక్స్. ఖ్యాతీ, రిత్విక్ పాత్రలతో ప్రేమలో పడతారు. ప్రతీ…
