ఆంధ్రప్రదేశ్

విశాఖలో ఆ ముగ్గురు అవుట్?

సిరా న్యూస్,విశాఖపట్టణం; విశాఖ జిల్లా పై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అక్కడ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బలమైన అభ్యర్థులను బరిలోదించాలని చూస్తున్నారు. జిల్లాలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరారు. తాజాగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సైతం అదే పని చేశారు. ఇది ఒక రకంగా వైసిపికి షాకింగ్ పరిణామమే. అందుకే వచ్చే ఎన్నికల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ చూస్తున్నారు. భారీగా అభ్యర్థుల మార్పునకు శ్రీకారం చుడతారని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లోనే ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ముగ్గురు సిట్టింగులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి మార్పు తప్పదని ప్రచారం జరుగుతోంది.విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, పాయకరావుపేట ఎమ్మెల్యే…

Read More
29 Dec 2023, 10:43 amsiranews.in