సిరా న్యూస్,సత్తెనపల్లి;
సత్తెనపల్లి పట్టణంలో బుధవారం అర్ధరాత్రి ముగ్గురు యువకులపై కత్తులతో దాడి జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఘటన జరిగింది. వినాయక చవితి వేడుకల్లో నిమగ్నమైన వడవల్లికి చెందిన ముగ్గురు యువకులపై దాడి జరిగింది. దాడి చేసిన వ్యక్తులు మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో నివసిస్తున్న యువకులుగా గుర్తించారు. చిన్న వివాదం చిలికి చిలికి గాలి వానలా మారిన వైనం.
తీవ్ర గాయాలైన కరాటే వెంకటేష్, పూర్ణ, రాజమంచి పవన్ కళ్యాణ్ కు సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని క్షతగాత్రుల తరపు బంధువులు ఆందోళన చేసారు.
దాడి చేసిన వారిలో ఒకరి బైకును తగలబెట్టారు. పరిస్థితి ఉధ్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెల్లాచెదురుచేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.