
బండ్ల బాటలో మరో ముగ్గురు…
సిరా న్యూస్,హైదరాబాద్; గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎపిసోడ్ తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఇటీవల గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణమోహన్ రెడ్డి కొన్ని రోజుల్లోనే మనసు మార్చుకున్నారు. ఇవాళ కాంగ్రెస్‌కు కటిఫ్ చెప్పి తిరిగి సొంత గూటికీ చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బండ్ల తిరిగి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బండ్ల ఎపిసోడ్‌తో స్టేట్ పాలిటిక్స్‌లో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. అధికార కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు కౌంటర్‌గా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఘర్ వాపసీకి తెరలేపినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గులాబీ గూటికీ తిరిగి వచ్చారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ మొదలైంది.రాష్ట్రంలో…
