
వైసీపీలో టిక్కెట్ల అలజడి పక్క చూపులు చూస్తున్న నేతలు
సిరా న్యూస్,విజయవాడ; ఎన్నికలకు ముందు ఓ రాజకీయ పార్టీపై అంచనాలు ఎలా ఉన్నాయనేది ఆ పార్టీలో ఉండే చేరికల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగింది. టిక్కెట్లు రావని తెలిసినా చాలా మంది నేతలు చేరిపోయారు. దీనికి కారణం కాంగ్రెస్ అధికారంలోకి వస్తందని.. తమకు ఎమ్మెల్యే కాకపోతే మరో పదవి ఇస్తారని ఆశాభావం. ప్రజల్లో ఉన్న మూడ్ రాజకీయ నేతలకు కాక ఇంకెవరికి తెలుస్తుంది...?. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న నమ్మకంతో అన్ని రాజకీయ పార్టీలు కార్యకలాపాలు పెంచాయి.వ్యూహాత్మకమో.. వ్యూహాత్మక తప్పిదమో కానీ వైసీపీ చీఫ్ , సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై త్వర త్వరగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాత్రికి రాత్రి పదకొండు స్థానాల్లో ఇంచార్జుల్ని మార్చేశారు.…
