
హైడ్రాను అడ్డుకుంటే ఎవరికి నష్టం…
సిరా న్యూస్,హైదరాబాద్; నాలుగేళ్ల కిందట హైదరాబాద్లో అతి భారీ వర్షం కురిసింది. ఎంత అంటే.. ఎప్పుడూ నీళ్లు చూడని రోడ్లు కూడా నదుల్లా పారాయి. పదుల సంఖ్యలో జనం కొట్టుకుపోయారు. హైదరాబాద్లోని సగం ఇళ్లు నీట మునిగాయి. అంత వరద వందేళ్లలో రాలేదని అప్పటి ప్రభుత్వం చెప్పింది. నాలాలు కబ్జాకు గురయ్యాయని.. చెరువుల్ని కబ్జా చేశారని అన్నింటినీ క్లియర్ చేసి..మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా చూస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో కూల్చివేతల్ని వ్యతిరేకిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పు చేస్తోందని అంటోంది. హైడ్రా బాధితులకు అండగా ఉంటామని చెబుతోంది. అంటే కబ్జాలు చేసిన వాళ్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుందా ?. ఇదే సపోర్టు ఉంటే.. మరతంగా కబ్జాలు పెరగవా ?. దీని వల్ల ఇతర ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉంటుందా ?…
