
నిజాయితీకి పోతే… ఇబ్బందులే.
సిరా న్యూస్,వరంగల్; వరంగల్ ఇరిగేషన్ సీఈ పరిధిలోని డీఈ హోదా అధికారి గోపికృష్ణ ఏడాదిన్నర కాలంగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. 2007లో ఇంజనీరింగ్ శాఖలో చేరిన గోపికృష్ణకు డిపార్ట్‌మెంట్‌లో నిజాయితీపరుడిగా పేరు ఉంది. విజిలెన్స్, ఏసీబీ అధికారుల నివేదికల అనంతరం గోపికృష్ణను ఉన్నతాధికారులు 2016 మే 3న వరంగల్ యూనిట్‌లోని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఈగా నియమించారు. వరంగల్ యూనిట్(ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల పరిధిలో)లో చాలా తక్కువ సమయంలోనే ఆయన సమర్థవంతమైన పనితీరుతో కాంట్రాక్టర్లు, అధికారుల ఆట కట్టించారు. టీఆర్ఎస్ తొలి విడత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖకు సంబంధించిన కీలక ప్రాజెక్టులు అమల్లోకి తీసుకువచ్చింది. రెండు ఉమ్మడి జిల్లాల్లో మిషన్ కాకతీయ ప్రొగ్రాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై గోపికృష్ణ రిపోర్టు చేయడంతో కొంతమంది అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారు. దాదాపు రూ. 50 కోట్ల…
