
Today is the death anniversary of Indian spiritual master Osho : నేడు భారతీయ అధ్యాత్మిక బోధకుడు ఓషో వర్ధంతి
సిరా న్యూస్; రజినీష్ చంద్రమోహన్ జైన్ 1960లలో ఆచార్య రజినీష్గా, 1970-1980లలో భగవాన్ శ్రీ రజినీష్ గా ఆ తరువాత ఓషోగా పిలువబడిన ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. ఇండియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలతో సహా ఎన్నో దేశాలలో నివసించి ఓషో మూవ్మెంట్ అనే ఒక వివాదాస్పదమైన కొత్త ఆధ్యాత్మిక సంఘాన్ని తయారుచేశాడు. ఇతడు మధ్యప్రదేశ్లో గల నర్సింగ్పూర్ జిల్లాలో ఉన్న కుచ్వాడాలో 11.12.1931న జన్మించాడు.19.1.1990 న మరణించాడు. ఓషో బోధన : జీవితానికి సంబంధించిన గొప్ప విలువలు ఎఱుక, ప్రేమ, ధ్యానం, సంతోషం, ప్రజ్ఞ, ఆనందం అని అతను బోధించాడు. జ్ఞానోదయం (ఎన్లైటెన్మెంట్) అన్నది ప్రతి ఒక్కరి సహజ స్థితి, కానీ అది తెలుసుకోలేకపోతున్నారు - మనషి ఆలోచనా విధానం ముఖ్య కారణం కాగా, సామాజిక పరిస్థితులు, భయం వంటివి మరి కొన్ని కారణాలు అని…
