
ఇక ట్రాఫిక్ చెక్…
సిరా న్యూస్,హైదరాబాద్; హైదరాబాద్ వాసులకు త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. మెట్రో రైలు విస్తరణకు త్వరలోనే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ట్రాఫిక్ బాధల నుంచి హైదరాబాదీలకు విముక్తి కల్పించడానికి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే మెట్రో విస్తరణ పనులపై దృష్టి పెట్టారు. అనేక మార్గాలను పరిశీలించారు. ప్రధానంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ మెట్రో విస్తరణకు చేపట్టాల్సిన పరిస్థితిపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.అయితే దావోస్ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెట్రో అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఫేజ్ 2 మెట్రో విస్తరణ రూట్ మ్యాప్ ను రేవంత్ కు అందించినట్లు తెలిసింది. నూతనంగా నాలుగు క్యారిడార్లలో ఈ మెట్రో నిర్మాణం పనులు చేపట్టాలని ఈ నివేదికలో పేర్కొన్నట్లు…
