
యాదాద్రిలో ఉద్యోగుల బదిలీ…
సిరా న్యూస్,నల్గోండ; యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉద్యోగుల ప్రక్షాళన ప్రారంభమైంది. ఆలయంలో ఏళ్ల తరబడి తిష్ట వేసిన 26 మంది ఉద్యోగులకు స్థానచలనం కలిగింది. యాదాద్రి నుంచి రాష్ట్రంలోని ఇతర ఆలయాలకు ఉద్యోగులను బదిలీ చేస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో సాధారణ బదిలీలను ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్జేసీ(6ఎ), డీసీ (6బి), ఏసీ (6సి) హోదా కలిగిన దేవాలయాలకు చెందిన ఉద్యోగులలో ఒకే చోట నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తున్న వారిలో 40 శాతం వరకే స్థానచలనం కలిగించాలన్నదే దేవాదాయశాఖ యోచన. ఇందులో భాగంగానే ప్రముఖ ఆలయాల్లో సుదీర్ఘ కాలంగా ఒకేచోట పనిచేయడంతో అవినీతి, అక్రమాల ఆరోపణలను కొందరు ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆలయాల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులను బదిలీ చేస్తే అవినీతి, అక్రమాలను…
