వణుకుతున్న అలుమూరు,
ఆసుపత్రి కి రోగులు పరుగులు సిరా న్యూస్,కోవూరు; పశ్చిమ గోదావరి పెనుమంట్ర మండలంలోని పలు గ్రామాల్లో జ్వరాలు, జలుబు, దగ్గు తదితర రుగ్మ తలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రక్తఫలకాలు క్షీణించి ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఆలమూరు గ్రామంలో ఈ సమస్య మరీ తీవ్రంగా కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో స్థానిక, సమీప పట్టణ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామం నుంచి వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన వారిలో 11 మందికి పరీక్షలు చేయగా ఏడుగురికి ప్లేట్ లెట్లు భారీగా క్షీణించినట్లు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. సుమారు నెల రోజుల కిందట కురిసిన వర్షాలకు స్థానిక ఎస్సీ ప్రాంతంలో నీరు నిలిచి మురుగు నీరు జత కలవడంతో పారిశుద్ధ్య సమస్య తలెత్తింది. ఈ సమయంలో ప్రారంభమైన అనారోగ్య సమస్యలు…
