తాజా వార్తలు

చేవెళ్లలో ట్రైయాంగిల్ ఫైట్

సిరా న్యూస్,హైదరాబాద్; వికారాబాద్ జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు.. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల అసెంబ్లీ స్థానాలు.. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. పాతిక లక్షల మంది ఓటర్లున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి జైపాల్ రెడ్డి గెలిచి కేంద్రమంత్రిగా పనిచేశారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, 2019లో బీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయం సాధించారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2019లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో కొనసాగుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్లలో పాగా వేయడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి.చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో మూడు చోట్ల కాంగ్రెస్, నాలుగు చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. హైదరాబాద్…

Read More
6 Jan 2024, 3:39 pmsiranews.in