
జూలై 1 నుంచి పిఠాపురం పర్యటన
సిరా న్యూస్,కాకినాడ; జులై 1వ తేదీ నుంచి తన నియోజక వర్గం పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు పిఠాపురంలో మంత్రి పవన్ కళ్యాణ్ వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు ఈ సందర్భంగా పవన్ కృతజ్ఞతలు తెలపనున్నారు. 3 రోజులపాటు పిఠాపురంతోపాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారని సమాచారం. కాకినాడ జిల్లా అధికారులు, పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షిస్తారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టులో పర్యటించనున్నారు. జూన్ 29వ తేదీన పవన్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తారు. అక్కడ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని…
