తాజా వార్తలు

మళ్లీ టీఆర్ఎస్సేనా…

సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ సాధించి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ పేరు మార్చగానే ఓటమిపాలైందనే టాక్ రాష్ట్రమంతా వినిపించింది. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి వరకు పార్టీ ప్రయాణం గమనిస్తే అదే అర్థమవుతుంది. పేరు మార్చిన తర్వాతే డౌన్ ఫాల్ మొదలైందని కార్యకర్తలు అందరూ చర్చించుకున్నారు. అదే విషయాన్ని బయటకి ఒప్పుకోకపోయినా అధిష్టానం కూడా దాదాపుగా ఏకీభవించింది.తాజాగా కేటీఆర్ చేసిన కామెంట్స్ మళ్లీ పార్టీ పేరును టిఆర్ఎస్‌గా మారుస్తారన్న చర్చకు దారితీసింది. ఇటీవల వచ్చిన రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి 2029లో ప్రాంతీయ పార్టీలదే దేశవ్యాప్త హవా అంటూ ఆయన కామెంట్ చేశారు. అయితే ఇప్పటికే పేరు మార్చుకొని జాతీయ పార్టీగా ఉన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ ప్రాంతీయ పార్టీలది హవా అంటూ వ్యాఖ్యానించడం పైన కార్యకర్తలు కూడా…

Read More
11 Oct 2024, 12:28 pmsiranews.in