తాజా వార్తలు

TRSMA Chigurumamidi: చిగురుమామిడి ట్రస్మా అధ్యక్షునిగా కొంపెల్లి సమ్మి రెడ్డి

సిరా న్యూస్, చిగురుమామిడి: చిగురుమామిడి ట్రస్మా అధ్యక్షునిగా కొంపెల్లి సమ్మి రెడ్డి కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం ట్రస్మా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు. గురువారం మండలంలోని డార్విన్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికలకు ట్రస్మా కరీంనగర్‌ జిల్లా అధ్యక్షులు కోరెం సంజీవ్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో ట్రస్మా మండల అధ్యక్షునిగా డార్విన్‌ పాఠశాల కరస్పాండెంట్‌ కొంపెల్లి సమ్మి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఇందుర్తి ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ కరస్పాండెంట్‌గా అప్పాల సమ్మయ్య, కోశాధికారిగా బొమ్మనపల్లి విస్డమ్‌ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్‌ కంది సంధ్య, సంయుక్త కార్యదర్శిగా రేకొండ బటర్‌ ఫ్లై ఉన్నత పాఠశాల కరస్పాండెంట్‌ ఏదులాపురం సతీష్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు కొంపెల్లి సమ్మిరెడ్డిని కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు.…

Read More
25 Jan 2024, 10:35 pmsiranews.in