తాజా వార్తలు

జమిలీ ఎన్నికలకు మరో రెండు అడుగులు

సిరా న్యూస్; జమలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. జమిలీ ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగ సవరణలు తప్పనిసరి అయిన దశలో.. పార్లమెంటు ఉభయసభలతో పాటు రాష్ట్ర అసెంబ్లీలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణకు పార్లమెంటులో మూడించ రెండు వంతుల ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం లోక్‌సభలో భాజపా బలం చూస్తే.. ఎన్డీయే పక్షాలతో పాటు ఇతర పక్షాల ఎంపీలు కూడా కొందరు సహకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్‌డీఏ బలం 293 కాగా.. రాజ్యాంగ సవరణ కోసం 362 మంది ఎంపీల మద్దతు అవసరం. ఇదే విధంగా రాజ్యసభలో ఎన్‌డీఏ బలం 121 కాగా.. రాజ్యాంగ సవరణలు చేపట్టాలంటే 164 మంది సభ్యుల మద్దతు ఉండాలి. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల మాటలకూ గౌరవం ఉంటుంది కాబట్టి.. రాజ్యాంగ సవరణకు సగం రాష్ట్రాల అసెంబ్లీలు అనుమతించాలి.…

Read More
19 Sep 2024, 1:18 pmsiranews.in