
ఏప్రిల్ ఒకటి తర్వాత రెండు వేల నోట్లు స్టాప్
సిరా న్యూస్,ముంబై; రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , 2 వేల రూపాయల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకున్నప్పటికీ, ఇప్పుడు కూడా వేల కోట్ల విలువైన పింక్ నోట్లు ప్రజల దగ్గర ఉన్నాయి. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ఇప్పటికీ పెద్ద నోట్ల డిపాజిట్లను అనుమతిస్తున్నారు. దీనికి సంబంధించి, ఆర్బీఐ ఒక అప్డేట్ ఇచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజున, అంటే 01 ఏప్రిల్ 2024న, రూ.2000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ సదుపాయం తన ప్రాంతీయ కార్యాలయాల్లో అందుబాటులో ఉండదని RBI ప్రకటించింది. ఏప్రిల్ 01న, తన 19 ఇష్యూ కార్యాలయాలు వార్షిక ఖాతాల ముగింపులో బిజీగా ఉంటాయని, ఆ రోజున రూ.2000 నోట్లను డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం కుదరదని కేంద్ర బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. రూ.2000 నోట్లను ఏప్రిల్ 02,…
