
ఉక్రేయిన్ యుద్దానికి రెండేళ్లు
సిరా న్యూస్; సైనికచర్య పేరుతో ఉక్రెయిన్పై రష్యా ప్రారంభించిన యుద్ధానికి నెలలో రెండేళ్లు పూర్తి కానుంది. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు – రష్యా మధ్య ఉన్న ఆధిపత్య పోరు ఉక్రెయిన్ను యుద్ధక్షేత్రంగా మార్చింది. నిత్యం బాంబుల మోతతో ఈ ప్రాంతం దద్దరిల్లుతున్నది. వేలాది మంది సైనికులు యుద్ధంలో ప్రాణాలు విడుస్తున్నారు. ఎందరో అమాయకులు, చిన్నారులు సైతం బాంబు దాడులకు బలయ్యారు. రూ.కోట్లు ఆయుధాల రూపంలో కాలిపోతున్నాయి. భవనాలు శిథిలాలుగా మారుతున్నాయి. వీధులు తుపాకీ చప్పుళ్లతో, సైనిక కవాతుతో మార్మోగుతున్నాయి. బంకర్లు ప్రజలతో నిండిపోతున్నాయి. ఏడాదిగా యుద్ధం మిగిల్చిన నష్టం అంతాఇంతా కాదు. కేవలం ఉక్రెయిన్, రష్యాపై మాత్రమే కాదు ప్రపంచమంతటిపై ఈ యుద్ధ ప్రభావం ఏదో రూపంలో పడింది.ఓ వైపు రష్యా_ ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నది. మరో వైపు ఆ రెండు దేశాల సరిహద్దుల్లో దారుణం…
