
ఉద్దానం ఊపిరి – వైఎస్సార్ సుజల ధార
ఈనెల 14న మకరాంపురంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం 807 గ్రామాలకు మంచినీరు అందేలా రూ 700 కోట్ల తో నిర్మాణం కిడ్నీవ్యాధి బాధిత ప్రాంతానికి సురక్షిత తాగునీరు సిరా న్యూస్,శ్రీకాకుళం; శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం మరో కీలక ప్రగతికి నాంది పలకనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈనెల 14న కంచిలి మండలం మఖరాంపురం గ్రామానికి రానున్నారు. అక్కడ జాతీయ రహదారి పక్కన నిర్మించిన వైఎస్సార్ సుజల ధార సురక్షిత తాగునీటి ప్రాజెక్టుని ప్రారంభిస్తున్నారు. జలజీవన్ మిషన్ లో భాగంగా ఏప్రిల్ 2020లో 700 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయి ప్రజలకు సురక్షిత నీటిని అందంచడానికి సిద్ధమైంది. హిరమండలం వంశధార రిజర్వాయిర్ నుంచి 100 కిలోమీటర్లుకు పైగా ప్రయాణించి ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధులు తీవ్రంగా ఉన్న 807 గ్రామాల ప్రజలకు…
