తాజా వార్తలు

బంగ్లాదేశ్‌లోనూ ఉక్రెయిన్ తరహా పరిస్థితులు

సిరా న్యూస్; బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే.. పదేళ్ల క్రితం ఉక్రెయిన్‌లో జరిగిన పరిణామాలు గుర్తుకొస్తున్నాయి. అప్పటి వరకు మిత్రరాజ్యాలుగా ఉన్న దేశాలే ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయిన పరిస్థితి ఉక్రెయిన్ – రష్యా మధ్య చోటుచేసుకోగా.. ఇప్పుడు బంగ్లాదేశ్-భారత్ మధ్య సంబంధాలు సైతం అదే మాదిరిగా మారాయి. సరిగ్గా పదేళ్ల క్రితం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పెద్ద ఎత్తున ప్రజాందోళన చెలరేగింది. నిరసనకారులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఇందులో కొందరు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు మరింత ఉధృతంగా విరుచుకుపడ్డారు. ఫలితంగా నాటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యంకోవిచ్ గద్దె దిగాల్సి వచ్చింది. అంతేకాదు, తన ప్రాణాలు కాపాడుకోడానికి రష్యాలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. విక్టర్ యంకోవిచ్ రష్యా అనుకూల వైఖరిని అవలంబించారు. యురోపియన్ యూనియన్‌, నాటో లో ఉక్రెయిన్ చేరాలన్న ప్రతిపాదనలను…

Read More
16 Aug 2024, 11:14 am
Updated: 16 Aug 2024, 11:15 am
siranews.in