
నిజామాబాద్ లో అమ్మో…కుక్కలు
సిరా న్యూస్,నిజామాబాద్; ఒక్క జూన్ నెలలోనే 435 కేసులు.. ఈ నెలలో ఇప్పటివరకు 243.. గత ఆరు నెలలుగా 300కు పైగానే.. సగటున రోజుకు 10 మంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుక్కల దాడిలో గాయపడుతున్నారు. పల్లె, పట్టణమన్న తేడా లేకుండా వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆకలి మంటతో జనం మీద దాడి చేస్తున్నాయి. వాటి పునరుత్పత్తి సీజన్లో డాగ్బైట్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి.వాటి పిల్లలను కాపాడుకునే ప్రయత్నంలో దగ్గరగా నడుచుకుంటూ వెళ్లేవారిని ఎటాక్ చేస్తున్నాయి. బండ్లపై వెళ్లే వారిని, ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లలను వదలట్లేదు. అసలు ఎటు నుంచి వచ్చి కుక్కలు దాడులు దాడి చేస్తున్నాయో తెలియక ప్రజలు రోడ్డు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. డాగ్ బైట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలోని ఎనిమల్…
