
నేటి నుండి జనవరి 6 వరకు మంథని మున్సిపల్ పరిధిలో ప్రజాపాలన వార్డు సభలు
-అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి -మంథని మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి సిరా న్యూస్,మంథని; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయ హస్తములో భాగంగా ఆరు గ్యారంటీలను అమలు పరుచుటకు ప్రజా పాలన కార్యక్రమము నిర్వహించ బడుతున్నదని మంథని మున్సిపల్కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి తెలిపారు. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహ జ్యోతి పథకం, ఇందిరమ్మ ఇండ్ల పథకం, చేయూత పథకానికి దరఖాస్తు చేసుకోవడానికిడిసెంబర్ 28వ తేది నుండి జనవరి 6వ తేది వరకు అన్ని వార్డులలో ప్రజా పాలన వార్డు సభలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఉదయం 8.00 గంటల నుండి మద్యాహ్నం12.00 గంటల వరకు మరియు మద్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు వార్డులో సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు.…
