
మరువలేని ‘నిరాడంబర ప్రధాని’ లాల్ బహదూర్ శాస్త్రి
సిరా న్యూస్; -నేడు ఆయన వర్ధంతి భారతదేశ రెండో ప్రధానమంత్రి, స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్రధారి లాల్ బహాదుర్ శాస్త్రి. భారతదేశపు నిరాడంబర ప్రధానులలో ఒకరైన లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్లోని మొఘల్ సరాయ్ గ్రామంలో 1904 అక్టోబర్ 2న జన్మించారు. ఎంతో దేశభక్తిగల ఆయన 1921లో సహాయ నిరాకరణోద్యమంలో అడుగుపెట్టారు. స్వాతంత్య్ర పోరాటంలో మొత్తం 9 సంవత్సరాలపాటు జైలులోనే గడిపారు. స్వాతంత్య్రం అనంతరం ఉత్రప్రదేశ్ రాష్ట్రమంత్రిగా పనిచేసి ఆ తరువాత 1951లో లోక్ సభ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. మహాత్మా గాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవహర్లాట్ నెహ్రూకు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత అతను భారతదేశ ప్రభుత్వంలో చేరి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొదట రైల్వే మంత్రిగా (1951–56), తరువాత హోంమంత్రిగానేకాక ఇతర బాధ్యతలను కూడా…
